కేరళ స్టేట్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ప్యానెల్ శుక్రవారం కీలక తీర్పిచ్చింది. ఇక నుంచి పాఠశాలల్లో ఉపాధ్యాయులను లింగాన్ని బట్టి సంబోధించకూడదని ఆదేశించింది. మగ టీచర్లను సార్ అని, ఆడ టీచర్లను మేడం అనే బదులు లింగభేదం లేకుండా ఇద్దరినీ ‘టీచర్’ అని పిలవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తన ఆదేశాలను అమలు చేసేలా చూడాలని విద్యాశాఖను ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. టీచర్ అని సంబోధించడం వల్ల అన్ని పాఠశాలల్లో పిల్లల మధ్య సమానత్వాన్ని కొనసాగించడానికి ఉపయోగపడడమే కాకుండా ఉపాధ్యాయులు, పిల్లల మధ్య అనుబంధాన్ని పెంచుతుందని బాలల హక్కుల కమిషన్ అభిప్రాయపడింది. అంతకుముందు టీచర్లను లింగం ఆధారంగా సంబోధించడం కారణంగా ఏర్పడుతున్న లింగ వివక్షతను నిర్మూలించాలని ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన తర్వాత పైవిధంగా స్పందించింది.