చిన్నారిని దత్తత తీసుకోలేదు..ఆ వార్తలు అవాస్తవం: కల్యాణి - MicTv.in - Telugu News
mictv telugu

చిన్నారిని దత్తత తీసుకోలేదు..ఆ వార్తలు అవాస్తవం: కల్యాణి

May 17, 2022

”నేను పాప తల్లిదండ్రులను తీసురావడానికి వెళ్లాను. నేను ఎవరినీ దత్తత తీసుకోలేదు. నా తల్లి విజలక్ష్మి నాతో ఉండదు. ఆమెకు ఏమీ తెలియదు. పిల్లలను అమ్ముకోవడం ఎవరైనా చూశారా? ఒంటరి మహిళ అంటే అంతా చులకనా? నాపై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. సినిమా వాళ్లకు చిన్నారిని అమ్ముకున్నాననని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు” అని కరాటే కల్యాణి అన్నారు.

ఇటీవలే యూట్యూబర్‌ శ్రీకాంత్‌పై కరాటే కల్యాణి దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదానికి సంబంధించి ఆమె ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి, సోమవారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చారు. కల్యాణి మాట్లాడుతూ..”మౌక్తిక అనే చిన్నారిని నేను ఇంకా దత్తత తీసుకోలేదు. పాపకు ఇంకా ఏడాది కూడా నిండలేదు. లీగల్‌గా చెల్లుబాటు కాకపోవడంతో ఇంకా దత్తత తీసుకోలేదు. త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తిచేస్తా’ అని ఆమె అన్నారు.

మరోపక్క కరాటే కల్యాణి అక్రమంగా పాపను దత్తత తీసుకుందంటూ ఫిర్యాదులు అందాయి. దాంతో చైల్డ్ వెల్ఫేర్ శాఖ అధికారులు కరాటే కల్యాణి నివాసంలో సోదాలు జరిపారు. కరాటే కల్యాణి అక్రమంగా దత్తత తీసుకున్నట్టు తేలితే మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఆమె చిన్నారి విషయంలో మీడియా ముందు క్లారిటి ఇచ్చారు.