వీడియో : చైనాలో ఘోరం.. అత్యాచారం కాదు కానీ మనం చాలా బెటర్ - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : చైనాలో ఘోరం.. అత్యాచారం కాదు కానీ మనం చాలా బెటర్

May 5, 2022

కరోనా కారణంగా దాని పుట్టినిల్లయిన చైనా అల్లాడిపోతోంది. ఆ దేశ వాణిజ్య రాజధాని షాంఘైలో భారీ స్థాయిలో కరోనా విరుచుకుపడుతోంది. వైరస్‌ను నివారించడానికి ఆ దేశ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను అత్యంత కఠినంగా అమలు చేస్తుంది. కరోనా కట్టడికి పౌరులకు బలవంతంగానైనా పరీక్షలు చేస్తోంది. ఇప్పుడు మనం చూసే వీడియో అలాంటిదే.

 

మొదట్లో ఓ యువతిపై అత్యాచారం జరుగుతుందేమో అనుకుంటాం కానీ, చివరి దాకా చూస్తే అసలు విషయం తెలుస్తుంది. యువతిని కిందపడేసి రెండు చేతులు వెనక్కి విరిచి ఓ వ్యక్తి గట్టిగా పట్టుకుంటే వైద్యులు ఆమెకు కరోనా టెస్టు చేస్తున్నారు. ఈ వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆ దేశ ప్రభుత్వంపై మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకా నయం. ఈ పద్ధతిలో మన ప్రభుత్వాలు చేయలేదు.