రేపు యాదాద్రికి నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు - MicTv.in - Telugu News
mictv telugu

రేపు యాదాద్రికి నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

January 17, 2023

The Cms Of Three States Will visit yadadri temple tomorrow

 

ఖమ్మంలో రేపు నిర్వహించే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు మూడు రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఈరోజు(మంగళవారం) రాత్రే వారు హైదరాబాద్ చేరుకోనున్నారు. కేరళ సీఎం పినరాయి విజయన్‌తో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌లతో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ మంగళవారం రాత్రి హైదరాబాద్ కు చేరుకుంటారు. వీరు బుధవారం ఉదయం 11గంటలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి యాదగిరిగుట్టకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఖమ్మం చేరుకొని ఖమ్మంలో కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొంటారు. మూడు రాష్ట్రాల సీఎంలతో పాటు పలు పార్టీల ప్రముఖులు నేడు రాష్ట్రానికి చేరుకొని, రేపు పలు ప్రాంతాల్లో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. బుధవారం ఆలయంలో ఆర్జిత సేవ‌లు, నిత్య కళ్యాణాలను రద్దు చేస్తు‌న్నట్టు ఆలయ ఈవో ఎన్‌ గీత తెలి‌పారు. అలాగే రేపు ఉ.9 నుంచి 10 గం.ల వరకూ బ్రేక్ దర్శనాలనూ రద్దు చేశారు. నాలుగు రాష్ట్రాల సీఎం లు వస్తుండడంతో భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రుల పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రెసిడెన్షియల్ సూట్స్, హెలిప్యాడ్ స్థలాన్ని రాచకొండ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ పరిశీలించారు.
ఖమ్మంలో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మంలో ఈ నెల 18న కనీవినీ ఎరగని స్థాయిలో బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దేశం మెచ్చేలా సభకు సన్నాహాలు చేస్తోంది. సభకు రెండు రోజుల ముందే ఖమ్మం నగరం భారీ కటౌట్లు, హోర్డింగ్‌లతో గులాబీమయమైంది.