The Commissioner of Education has released the teachers' promotion schedule
mictv telugu

ఏపీ టీచర్లకు గుడ్‌న్యూస్.. ప్రమోషన్ షెడ్యూల్ విడుదల

October 4, 2022

ఏపీలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టీచర్ల పదోన్నతుల షెడ్యూల్‌ను విడుదల చేసింది. జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్స్, గ్రేడ్ 2 హెడ్ మాస్టర్ల షెడ్యూలును విద్యాశాఖ కమిషనర్ మంగళవారం విడుదల చేశారు. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్స్ ప్రైమరీ సీనియారిటీ లిస్టును ఈ నెల 7న వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్టు ఆయన వెల్లడించారు. టీచర్లకు ఏమైనా అభ్యంతరాలుంటే అక్టోబర్ 8లోపు ఆన్‌లైన్ ద్వారా తెలియజేయాలని సూచించారు. వాటిని సంబంధిత అధికారులు ఈ నెల 9న పరిశీలించి తుది సీనియారిటీ లిస్టును 10వ తేదీన విడుదల చేస్తారని వివరించారు. గ్రేడ్ 2 పోస్టుల ప్రమోషన్లను 11వ తేదీన, స్కూల్ అసిస్టెంట్లు దానికి సమానమైన ఇతర పోస్టుల పదోన్నతులను 12, 13 తేదీల్లో విడుదల చేస్తామని పేర్కొన్నారు.