The consumer court ordered TTD to pay Rs. 50 lakhs to Devotee
mictv telugu

భక్తుడికి దర్శనం కల్పించనందుకు టీటీడీకి రూ. 50 లక్షల జరిమానా

September 3, 2022

తిరుమల తిరుపతి దేవస్థానంకు వినియోగదారుల కోర్టు షాకిచ్చింది. ఒక భక్తుడికి దర్శనం కల్పించడంలో విఫలమైన టీటీడీని తప్పుపట్టిన కోర్టు.. రూ. 50 లక్షలు భక్తుడికి చెల్లించాలని ఆదేశించింది. పూర్తి వివరాల్లోకెళితే.. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన హరి భాస్కర్ అనే శ్రీవారి భక్తుడు మేల్ చాట్ వస్త్రం సేవ కోసం 2006లో టీటీడీకి రూ. 12,250 చెల్లించారు. అయితే ఆయనకు ఇప్పటివరకు ఆ దర్శనం లభించలేదు. 17 ఏళ్ల నుంచి పలుమార్లు ఫిర్యాదు చేసినా బోర్డు స్పందించలేదు. అయితే కరోనా సమయంలో మాత్రం మేల్ చాట్ వస్ర్తం సేవకు బదులుగా వీఐపీ దర్శనం కల్పిస్తామని టీటీడీ ఆఫర్ చేసింది. కానీ, ఆ ఆఫర్‌ను భాస్కర్ తిరస్కరించారు. తాను బుక్ చేసిన సేవనే కావాలని డిమాండ్ చేశాడు. అయినా టీటీడీ పట్టించుకోకపోవడంతో సేలంలోని వినియోగదారుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు.. భాస్కర్‌కు ఏడాది లోపు ఆయన కోరిన సేవ లేదా దర్శనం కల్పించాలని, లేదంటే రూ. 50 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.