Home > Featured > మళ్లీ ముఖ్యమంత్రి మార్పు!.. ఖరీదు రూ. 2500 కోట్లు

మళ్లీ ముఖ్యమంత్రి మార్పు!.. ఖరీదు రూ. 2500 కోట్లు

The cost of karnataka CM post is Rs. 2500 crores : Hari Prasad

కర్ణాటక ముఖ్యమంత్రి పదవి ఖరీదు రూ. 2500 కోట్లని ప్రతిపక్షనేత, కాంగ్రెస్ నాయకుడు హరిప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీలో ఆ పదవి విలువ అంత అని ఆ పార్టీ నేతనే తనకు చెప్పినట్టు అసెంబ్లీ సాక్షిగా ఆరోపించారు. ఇంత పెద్ద మొత్తం అయినా పదవి కోసం పోటీ పడే వారి సంఖ్య చాలా ఉందని, ఖర్చుకు ఎవరూ వెనకాడడం లేదన్నారు. అయితే తనతో ఆ విషయం చెప్పిన నేత పేరు మాత్రం ఆయన వెల్లడించలేదు.

కాగా, గత కొంతకాలంగా ప్రస్తుత సీఎం బసవరాజ్ బొమ్మైని తొలగిస్తున్నారనే ప్రచారం జరిగింది. దీనికి తోడు మొన్న మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పను బీజేపీ పార్లమెంటరీ కమిటీలో చోటివ్వడంతో ఆ రూమర్లకు మరింత బలం చేకూరినట్టైంది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ తోసిపుచ్చారు. ప్రస్తుత సీఎం బొమ్మైని తొలగించే ప్రసక్తే లేదన్నారు. ఆయన తన పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారని, ఆయన నాయకత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు.

Updated : 20 Aug 2022 5:04 AM GMT
Tags:    
Next Story
Share it
Top