మరికాసేపట్లో మునుగోడు బైపోల్ కౌంటింగ్.. ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ - MicTv.in - Telugu News
mictv telugu

 మరికాసేపట్లో మునుగోడు బైపోల్ కౌంటింగ్.. ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ

November 6, 2022

The counting of votes for the Munugode by-election will begin shortly

రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో  ప్రారంభం కానుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఉప ఎన్నిక సెమీ ఫైనల్‌గా భావించి.. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ నెల రోజుల పాటు పోటాపోటీగా ప్రచారం చేసి అహర్నిశలు శ్రమించాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయి ఓటింగ్‌ నమోదైంది. ఈ ఫలితాలపై పార్టీ అభ్యర్థులతోపాటు, ప్రధాన రాజకీయ పక్షాల్లో, అటు రాష్ట్ర ప్రజల్లో కూడా ఎడతెగని ఉత్కంఠ నెలకొంది.

టీఆర్ఎస్ నుంచి బరిలో దిగిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా 47 మంది భవితవ్యం ఏంటో మరికొన్ని గంటల్లో తేలనుంది. మొత్తం 2,41,805 మంది ఓటర్లకుగాను 2,25,192 మంది ఓటు వేశారు. నల్గొండలోని ఆర్జాలబావి ఎఫ్​ సీఐ గోదాంలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్​ ఓట్లను లెక్కించిన అనంతరం ఈవీఎంల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదటి రౌండ్​ ఫలితం ఉదయం 9.15 గంటల వరకు వచ్చే అవకాశం ఉండగా.. మధ్యాహ్నం 2గంటల కన్నా ముందే తుది ఫలితం వెలువడనుంది.