ధోనీ.. మీరు రిటైర్ కావొద్దు.. లతా మంగేష్కర్ - MicTv.in - Telugu News
mictv telugu

ధోనీ.. మీరు రిటైర్ కావొద్దు.. లతా మంగేష్కర్

July 11, 2019

Lata Mangeshkar tells MS Dhoni.

‘ధోనీజీ మీరు ఇప్పుడప్పుడే రిటైర్మెంట్ ప్రకటించకండి.. మీలాంటి ఆటగాళ్లు ఈ దేశానికి చాలా అవసరం’ అని బాలీవుడ్ సీనియర్ గాయని లతా మంగేష్కర్ ట్వీట్ చేశారు. గతకొంత కాలంగా ధోనీ రిటైర్మెంట్ గురించి పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవాలని ఎన్నో కలలు కన్న భారత్ చిత్తుగా ఓడిపోయింది. నిన్న జరిగిన సెమీస్‌లో కివీస్‌ చేతిలో భారత్‌ ఓడిపోగా, టీమిండియా క్రికెటర్లు తీవ్ర నిరాశలో పడిపోయారు. ఈ నేపథ్యంలో మరోమారు ధోనీ తన రిటైర్మెంట్‌పై ఎలాంటి ప్రకటన చేస్తారని సోషల్ మీడియాలో రకరకాల గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.

దీనిపై లతా మంగేష్కర్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ధోనీజీ.. ఈ మధ్యకాలంలో నేను మీ రిటైర్మెంట్‌ గురించి చాలా వార్తలు వింటున్నాను. దయచేసి మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. దేశానికి మీలాంటి క్రీడాకారుల అవసరం ఎంతో వుంది. రిటైర్మెంట్‌ గురించి మీరు ఆలోచించకూడదని నేను కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ‘అవును ధోనీ రిటైర్మెంట్ చేయకూడదు’ అంటూ ధోనీ అభిమానులు కోరుతున్నారు.