The couple filed a case against Punju in germany
mictv telugu

రోజుకి 200 సార్లు కూత.. పుంజుపై కోర్టుకెక్కిన జంట

August 16, 2022

Dil Raju's explanation on Karthikeya 2

ఇప్పుడంటే అలారం వచ్చింది కానీ, గతంలో కోడి కూతతో మేల్కొనేవారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కోడికూతతోనే నిద్ర లేస్తారు. మన ఇంటి చుట్టూ అవి తిరుగుతూనే ఉంటాయి కూడా. కానీ, జర్మనీలో ఓ వృద్ధ జంట మాత్రం పుంజుపై కోర్టు మెట్లెక్కారు. పక్కింటిలోని కోడి పుంజు రోజూ రెండొందల సార్లకు పైగా కూత పెడుతోందని, ఆ శబ్దాన్ని భరించలేకపోతున్నామని పిటిషన్ వేశారు. దాన్ని ఎలాగైనా అక్కడినుంచి తరలించేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. వివరాల్లోకెళితే.. వోర్సెస్టర్ నగరానికి చెందని మైఖేల్ అనే వ్యక్తికి కోళ్లను పెంచే అలవాటు ఉంది. ఐదేళ్ల కింద ముచ్చటపడి యాక్టివ్‌గా ఉండే పుంజును ఇంటికి తెచ్చుకున్నాడు. దానికి ముద్దగా మాగ్డా అని పేరు పెట్టుకుని పెంచుకుంటున్నాడు. అయితే అది నిత్యం కూత పెడుతూనే ఉంటుంది.

పుంజు దెబ్బకి పక్కింట్లో నివాసం ఉండే వ‌ృద్ధ జంటకి అది చాలా ఇబ్బందిగా మారింది. పుంజును వేరే చోటుకి తరలించమని మైఖేల్‌కి చెప్తే.. ససేమిరా కుదరదని చెప్పేశాడు. పుంజు లేకపోతే పెట్టలు కంట్రోల్‌లో ఉండవని కారణం చెప్పడంతో కొన్నాళ్లు భరించిన ఆ జంట ఇక లాభం లేదనుకొని కోర్టుకెళ్లింది. అయితే కేవలం పిటిషన్ మాత్రమే కాదు, ఆ పుంజు రోజుకి ఎన్నిసార్లు కూత పెడుతుందో లెక్కబెట్టి మరీ వివరాలను కోర్టుకు సమర్పించారు. కూతల వల్ల ఫోన్ కాల్స్ సరిగ్గా మాట్లాడలేకపోతున్నామని, జూమ్ మీటింగుల్లో కూడా దాని శబ్దంతో చికాకు కలుగుతోందని ఫిర్యాదు చేశారు. అన్నింటినీ పరిశీలించిన కోర్టు.. చివరికి మైఖేల్‌ను పిలిచి వెంటనే పుంజును అక్కడినుంచి తరలించాలని ఆదేశాలు జారీ చేసింది.