విద్యార్థిని కొట్టినందుకు టీచర్లకు మూడేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు - MicTv.in - Telugu News
mictv telugu

విద్యార్థిని కొట్టినందుకు టీచర్లకు మూడేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

April 5, 2022

 

t

దండించేంత కారణం లేకపోయినా అకారణంగా ఓ విద్యార్థిని వాతలు వచ్చేలా కొట్టారని గుజరాత్‌లో ఓ కోర్టు ఇద్దరు టీచర్లకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకెళితే.. గుజరాత్‌లోని మీర్జాపూర్‌లో ఐదేళ్ల చిన్నారి విద్యార్థి కిండర్ గార్డెన్ స్కూల్లో చదువుతున్నాడు. ఈ క్రమంలో టాయిలెట్‌కు వెళ్లడానికి, నీళ్లు తాగడం కోసం మాటిమాటికీ టీచర్ల అనుమతి కోరాడు. దీంతో విసిగిపోయిన టీచర్లు, చిన్నారి కాళ్లపై వాతలు పడేలా తీవ్రంగా కొట్టారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పిగా, వారు టీచర్లపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం కేసు నమోదైన నేపథ్యంలో విచారించిన స్థానిక కోర్టు.. ఇద్దరు టీచర్లు పర్బతియా, నజ్మా షేక్‌లకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాక, టీచర్లపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది.