బతికున్న చేపను వడ్డించిన సిబ్బంది.. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

బతికున్న చేపను వడ్డించిన సిబ్బంది.. వీడియో వైరల్

March 31, 2022

fish

ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ, సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. వీడియో ప్రకారం చూస్తే.. రెస్టారెంటుకు వెళ్లిన వ్యక్తి సీ ఫుడ్ ఆర్డర్ చేశాడు. కొద్ది సేపటి తర్వాత సిబ్బంది ఫుడ్ సర్వ్ చేశారు. ఎదురుగా నోరూరించే వంటకం ఉండడంతో ఆ వ్యక్తి ఓ చేపను తినబోయాడు. ఇంతలోనే షాకయి ఉలిక్కిపడ్డాడు. ఎందుకంటే ఓ చేప నోరు తెరుస్తూ ఉంది. బతికున్న చేపను వడ్డించారని గ్రహించిన ఆ వ్యక్తి వీడియో తీసి నెట్టింట వదిలాడు. ప్రస్తుతం ఈ వీడియోను చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వంటకం చైనా, థాయిలాండ్, కొరియా, జపాన్ వంటి దేశాల్లోనే తింటారు కాబట్టి, వీడియో అక్కడిదే అయి ఉంటుందని మెజారిటీ నెటిజన్ల అభిప్రాయం.