వీడియో : దళిత మైనర్ బాలుడిని కొట్టి కాలు నాకించారు - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : దళిత మైనర్ బాలుడిని కొట్టి కాలు నాకించారు

April 19, 2022

01

తన తల్లి చేసిన పనికి డబ్బులు ఇవ్వాలంటూ అడిగిన మైనర్ దళిత బాలుడిని బెల్టుతో కొట్టి కాలు నాకించిన అమానుష ఘటన యూపీలో జరిగింది. ఘటనను వీడియో తీయడంతో వైరల్‌గా మారింది. రాయ్‌బరేలీలో ఈ నెల 10న జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పదో తరగతి చదువుతున్న బాలుడి తల్లి నిందితుల్లో ఒకరి పొలంలో వ్యవసాయ కూలీగా పనిచేస్తోంది. కూలీ డబ్బులు ఇవ్వాలని విద్యార్ధి వెళ్లి యజమాని అయిన నిందితుడిని అడిగాడు. ఈ క్రమంలో మమ్మల్నే డబ్బులు అడుగుతావా? అంటూ విద్యార్ధిపై బెల్టుతో దాడి చేశారు. ఆ తర్వాత కాలు నాకించారు. విద్యార్ధి ఎంత బతిమిలాడినా వారు వినిపించుకోలేదు. దెబ్బలకు తాళలేక ఏడుస్తుంటే గట్టిగా నవ్వారు. విద్యార్ధి గంజాయి అమ్ముతున్నాడని నిందితులు ఆరోపించగా, బాలుడు దెబ్బల భయంతో అవునంటూ అంగీకరించాడు. ఆ తర్వాత బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని ఇప్పటివరకు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు.