రంగస్థలం పాటపై భగ్గుమన్న యాదవులు - MicTv.in - Telugu News
mictv telugu

రంగస్థలం పాటపై భగ్గుమన్న యాదవులు

March 15, 2018

telugu-news-మార్చి 30న విడుదల కానున్న ‘రంగస్థలం’ చిత్రాన్ని వివాదాలు చుట్టుముట్టాయి. ఈ చిత్రంలో చంద్రబోస్ రాసి, ముంబై భామ మాన‌సి పాడిన‌ ‘రంగమ్మ మంగమ్మ ’ పాట వివాదాస్పదమైంది. ఈ పాటల  ‘గొల్లభామ వచ్చి నాగోరు గిచ్చుతుంటే’ అంటూ సాగిన చరణం యాదవ మహిళలను కించపరిచే విధంగా ఉందని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు రాములు యాదవ్‌ డిమాండ్‌ చేసారు. పాటలోని ఆ చరణాన్ని వెంట‌నే తొలగించాలని, లేదంటే సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌ని అడ్డుకుంటామ‌ని హెచ్చరిస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.1985 కాలం నాటి గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఇటు మాస్‌, అటు క్లాస్ ప్రేక్ష‌కుల‌ని అల‌రించనుంద‌ని టీం చెబుతోంది. రాంచ‌ర‌ణ్‌, స‌మంత జంటగా నటిస్తుండగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.