కమెడియన్ అలీ కలను నెరవేర్చిన కూతురు ఫాతిమా - MicTv.in - Telugu News
mictv telugu

కమెడియన్ అలీ కలను నెరవేర్చిన కూతురు ఫాతిమా

April 12, 2022

ali02

ప్రముఖ కమెడియన్ అలీ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. బాల నటుడిగా పరిశ్రమలో ప్రవేశించి హీరోగా, కమెడియన్‌గా, వ్యాఖ్యాతగా ఇలా అడుగుపెట్టిన అన్నింటిలో తనదైన ముద్రను వేయగలిగారు. మరోపక్క బుల్లితెరపైన కూడా సక్సెస్ అయ్యారు. ఇదిలా ఉండగా, అలీకి ముగ్గురు సంతానం. పెద్ద కూతురు ఫాతిమా గురించి ఓ శుభవార్తను అలీ పంచుకున్నారు. ఫాతిమా ఇటీవల డాక్టర్ అయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు అలీ. తమ కుటుంబంలో ఫాతిమా మొదటి డాక్టర్ అని అలీ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. తన కూతురు డాక్టర్ కావడం అలీ కోరికంట. కాగా, తండ్రి కోరికను నెరవేర్చిన కూతురు అంటూ నెటిజన్లు ఫాతిమాను ప్రశంసిస్తున్నారు.