అతి సర్వత్రా వర్జయేత్ అని ఓ సామెత ఉంది. ఏ పని చేసినా అతిగా కాకుండా మితంగా చేయాలని దాని అర్థం. అప్పుడే అందరికీ బాగుంటుంది. తినడం అయినా, పడుకోవడం అయినా, డబ్బులు దుబారా చేసినా, ఇతరాత్ర ఏ పని చేసినా, ఆఖరికి శృంగారం చేసినా దానికి ఒక హద్దు ఉంటుంది. అది దాటితే మనకే ప్రమాదం. నిత్యం శృంగారం చేయడం ఆరోగ్యానికి మంచిది. ఎటూ ఆరోగ్యానికి మంచిదని నిత్యం మూడు నాలుగు సార్లు శృంగారం చేస్తారా? అయితే పోర్న్ వీడియోల ప్రభావమో మరేదో గానీ ఓ యువతి తన బాయ్‌ఫ్రెండుతో అసహజ శృంగారాన్ని కోరింది. అది బెడిసికొట్టి ఆమె ప్రాణాలు పోయాయి. క్షణిక సుఖం కోసం విలువైన ప్రాణాన్ని పోగొట్టుకుందామె.
ఈ ఘటన థాయ్‌ల్యాండ్‌లోని పట్టాయాలో చోటు చేసుకుంది. యూకేకు చెందిన ఓ టూరిస్ట్ పట్టాయాకు వెళ్ళాడు. పట్టాయాలోని సావో బుకాయో బీచ్‌లోని ఓ హోటల్లో గది అద్దెకు తీసుకుని, ఓ మహిళతో బాగా ఎంజాయ్ చేయాలని భావించాడు. అనుకున్నదే తడవుగా ఓ మహిళను మాట్లాడుకున్నాడు. అయితే ఆమె అతనితో అసహజ శృంగారాన్ని కోరింది. ఆమె కోరినట్టుగానే టూరిస్ట్ చేశాడు. మెడకు తాడు కట్టి శృంగారం చేశాడు. కానీ, ఆ ప్రయోగం విఫలం కావడంతో మహిళ ప్రాణాలు కోల్పోయింది. షాక్ అయిన టూరిస్ట్ హోటల్ యాజమాన్యం సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.