The developers of the iBOMMA website have announced that they are going to shut down,
mictv telugu

iBOMMA ఆగిపోయింది.. సినీ అభిమానుల్లో కలవరం

July 7, 2022

The developers of the iBOMMA website have announced that they are going to shut down,

ఓటీటీ షోలతో పాటు, ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలతో సినీ ప్రేక్షకులను అలరిస్తున్న iBOMMA అనే మూవీ వెబ్ సైట్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. కొన్ని ఓటీటీ ప్లాట్ ఫాం లలో మెంబర్‌షిప్ లేని వాళ్లు, కొత్త సినిమాలను థియేటర్‌కు వెళ్లి చూడలేని వాళ్లు.. ఆ సినిమాలు ఓటీటీలోకి రిలీజ్ అయిన వెంటనే iBOMMA వెబ్ సైట్ లో సెర్చ్ చేస్తారు. కారణం ఓటీటీలోకి వచ్చిన దాదాపు ప్రతి సినిమా ఈ సైట్ లోనూ విడుదలవుతోంది. ఎలాంటి పేమెంట్ చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచితంగా సినిమాలు చూసేయొచ్చు.

అయితే iBOMMA వెబ్ సైట్ మూసి వేయబోతున్నట్లు డెవలపర్లు ప్రకటించడంతో సినీ ప్రేమికుల్లో కలవరం మొదలైంది. వందల రూపాయలతో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు తీసుకునే బదులు iBOMMA లో ఉచితంగా సినిమాలు చూశామని.. ఇలా అర్ధాంతరంగా మూసివేస్తే ఎలా అంటూ నెట్టింట పోస్టులు, మీమ్స్ చేస్తున్నారు. కమల్ హాసన్ కొత్త సినిమా విక్రమ్ రేపు ఓటీటీలో రిలీజ్ అవుతుండడంతో.. కనీసం అప్పటివరకైనా ఆగాలని అడుగుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టులు వైరల్ అవుతున్నాయి.