The director who was fired on Kuthuri..I don't want a film with him
mictv telugu

ఆ హీరోతో సినిమా వద్దు: దర్శకుడు శంకర్

August 15, 2022

తమిళ ఇండస్ట్రీ దర్శక ధీరుడు, దక్షిణాది సినీ ప్రియులకు సుపరిచితుడు. ‘ఒకే ఒక్కడు’, ‘భారతీయుడు’, ‘స్నేహితుడు’, ‘రోబో’, ‘రోబో-2’ వంటి ప్రముఖ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శంకర్..తన పెద్ద కూతురు అదితి శంకర్‌‌పై ఫైర్ అయ్యారు. అందుకు కారణాలు ఏమిటో తమిళ వర్గాలు తెలిపాయి.

దర్శకుడు శంకర్‌కు.. ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు. ఇద్దరు కూతుళ్లు డాక్టర్‌ విద్యను అభ్యసించారు. అందులో పెద్ద కూతురు అదితి శంకర్‌..ఈమెకు సినిమా హీరోయిన్‌ కావాలన్నది చిరకాల కోరిక. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వెంటనే తన కలను నెరవేర్చుకోవడానికి సిద్ధమయ్యింది. కానీ, ఆమె సినిమాల్లోకి రావడం శంకర్‌కు ఏమాత్రం ఇష్టం లేదు. ఈ విషయాన్ని అదితి శంకర్‌నే ‘విరుమాన్‌’ చిత్ర ఆడియో విడుదల వేదికపై స్వయంగా చెప్పింది.

అయితే, హీరోయిన్‌గా సక్సెస్‌ కాకపోతే మళ్లీ వైద్య వృత్తిని చేపడుతానని తండ్రికి నచ్చజెప్పి, ఒప్పించి నటిగా ‘విరుమాన్‌’ చిత్రం ద్వారా రంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రానికి ముత్తయ్య దర్శకుడు, హీరో కార్తీ కావడంతో అదితి అందులో నటించడానికి శంకర్‌ అంగీకరించాట. అయితే, ఆయనకు అసలు టెన్షన్‌ ఆ తరువాతే మొదలైందట. తొలి చిత్రాన్ని పూర్తి చేసిన అదితి శంకర్‌.. తర్వాత చిత్రంలో శింబు హీరోగా, హీరోయిన్‌గా అదితి శంకర్ నటిస్తున్న తాజా చిత్రం ‘కరోనా కుమార్‌’. ఈ చిత్రంలో ఆమెకు నటించే అవకాశం దక్కడంతో.. ఇది దర్శకుడు శంకర్‌కు ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో ఆ చిత్రంలో నటించరాదని కూతురికి సీరియస్‌గా చెప్పాడట. అందుకు కారణం..నటుడు శింబుపై ఇది వరకే ప్రేమ వివాదాలు అనేక ఉండటమే’ అని సినీ వర్గాలు తెలిపాయి.