వైద్యుడు దేవునితో సమానం అంటారు. ఈ వ్యాక్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు ఓ డాక్టరు. పేషెంట్ సర్జరీ కోసం ఇంటి నుంచి బయల్దేరగా, మధ్యలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. దీంతో ఆలస్యం చేయకూడదని భావించిన డాక్టరు.. ఆపరేషన్ కోసం వేచి చూస్తున్న పేషెంట్ కోసం కారు దిగి రోడ్డుపై పరిగెత్తాడు. అలా సుమారు మూడు కిలోమీటర్ల దూరం పరుగెత్తి సమయానికి ఆపరేషన్ చేసి పేషెంట్ ప్రాణాలను కాపాడారు. సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. వివరాలు.. మధ్య బెంగళూరుకి చెందిన డాక్టర్ గోవింద్ నందకుమార్ సర్జాపూర్‌లోని మణిపాల్ ఆస్పత్రిలో గ్యాస్ట్రో ఎంటరాలజీ సర్జన్‌గా పని చేస్తున్నారు. ఆగస్టు 30న ఆస్పత్రిలోని ఓ పేషెంట్‌కు అత్యవసర ల్యాపరోస్కోపిక్ గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేసేందుకు ఇంటి నుంచి అనుకున్న సమయానికి బయల్దేరారు. కానీ, మార్గమధ్యంలో భారీ ట్రాఫిక్ ఏర్పడడంతో డాక్టరు అందులో చిక్కుకుపోయారు. వర్షాల కారణంగా ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. ట్రాఫిక క్లియర్ అవ్వడానికి లేట్ అయ్యే అవకాశాలు ఉండడంతో సమయానికి వెళ్లకపోతే రోగి ప్రాణాలకు ప్రమాదమని తలచి వెంటనే కారు దిగారు. మరో ఆలోచన చేయకుండా ఆస్పత్రికి పరిగెత్తారు. మూడు కిలోమీటర్లు పరుగెత్తి పేషెంటుకి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఈ విషయాన్ని ఆయనే వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తూ కామెంట్టు పెడుతున్నారు.
@BPACofficial @BSBommai @sarjapurblr @WFRising @blrcitytraffic sometimes better to run to work ! pic.twitter.com/6mdbLdUdi5
— Govind Nandakumar MD (@docgovind) September 10, 2022