వింత.. రోగి డాక్టరు ముందు ఏడ్చినందుకు మూడువేల బిల్లు వేసిన ఆస్పత్రి - MicTv.in - Telugu News
mictv telugu

వింత.. రోగి డాక్టరు ముందు ఏడ్చినందుకు మూడువేల బిల్లు వేసిన ఆస్పత్రి

May 19, 2022

రోగి డాక్టరు వద్ద ఏడ్చినందుకు గాను సదరు ఆస్పత్రి రూ. 3వేలను బిల్లు వేసింది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజంగా జరిగింది. అమెరికాలోని ప్రముఖ యూట్యూబర్ అయిన కమిల్లే జాన్సన్ అనే మహిళ తన చెల్లెలికి ఎదురైన అనుభవాన్ని తన ఫాలోయర్లతో పంచుకొంది.

ఆమె చెప్పిన ప్రకారం.. ‘నా చెల్లెలు ఓ మానసిక రుగ్మతతో బాధపడుతోంది. చిన్నపాటి బాధ కలిగినా ఆమె తట్టుకోలేదు. అసహనం, కోపం వంటివి వచ్చినప్పుడు వెంటనే ఏడ్చేస్తుంది. దీంతో డాక్టరు సలహా తీసుకుందామని ఆస్పత్రికి వెళ్తే పలు రకాల టెస్టులు చేసి భారీ స్థాయిలో బిల్లు వేశారు. బిల్లులో టెస్టులు, వాటి రేట్లు మెన్షన్ చేశారు. ఓ చోట ఏడ్చినందుకు 40 డాలర్లు అని ఉంది. దాన్ని చూసి నేను నమ్మలేకపోయా.

డాక్టరు వద్ద బాధలు చెప్పుకున్నందుకు 40 డాలర్లు (రూ. 3100) వసూలు చేయడం నేనెక్కడా చూడలేదు. ఆమె ఎందుకు ఏడ్చింది? ఆమెకు ఏ విధంగా సహాయం చేశారు? ఏడుపు తగ్గేందుకు మెడిసిన్ ఏమైనా ఇచ్చారా? లాంటి వివరాలు బిల్లులో లేవు’ అని చెప్పుకొచ్చింది. అంతేకాక, బిల్లును ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. మీరూ ఓ లుక్కేయండి.