ఆపరేషన్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. పేషెంట్‌ను ఆపరేషన్ థియేటర్ లోకి తరలించారు. వైద్యులు కత్తులు పట్టుకొని పేషెంట్‌ను చకాచకా కోసేశారు. ఇంతలో ఏమైందో ఆపరేషన్ సగంలో ఆపేసి..మేము ఇది చేయలేమంటూ చేత్తులెత్తేశారు. వేరే దగ్గరికి తీసుకుపోవాలని చావు కబురు చల్లగా చెప్పారు. చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల చేసిన నిర్వాకంతో బాధితులు షాకయ్యారు.
పూర్తి వివరాల్లోకి వెలితే.. యాదమరి మండలం దళవాయిపల్లికి చెందిన పుష్పమ్మ ఇంట్లో జారిపడడంతో తొడ ఎముకకు గాయమైంది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పుష్పమ్మ కొన్ని రోజులు అబ్జర్వేషన్లో పెట్టి..తర్వాత గాయానికి ఎక్స్ రే తీయించారు. ఎక్స్‌రే ను పరిశీలించిన వైద్యలు ఆమె ఆపరేషన్ చేయాలని చెప్పారు. అందుకోసం బుధవారం ఆపరేషన్ గదికి తీసుకెళ్లారు. ఇంతలో ఆపరేషన్‌ను తాము చేయలేమని చెప్పి సగంలోన ఆపేసి బయటకు వచ్చారు. పేషెంట్ వేరే ఆస్పత్రికి తీసుకువెళ్లాలని బంధవులకు సూచించారు. బాధితులు గట్టిగా అడగడంతో వేరు వేరు కారణలతో చెప్పి తప్పించుకుంటున్నారు. పేషెంట్ ఎముకలు గట్టిగా లేవని..ఆపరేషన్ సాధ్యం కాదని వైద్యులు చెప్పడంతో వారు సూపరింటెండెంట్ అరుణ్ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. బంధింత వైద్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని సూపరింటెండెంట్ హామీ ఇచ్చారు. పుష్పమ్మ తొడ భాగాన్ని కోసిన వైద్యులు, మధ్యలో కుట్లు వేసి వదిలేశారు. ఆమెను ప్రస్తుతం ఆస్పత్రి వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.