The dog that ran over the airport runway
mictv telugu

వీడియో : ఎయిర్‌పోర్టులో కుక్క హల్‌చల్.. పరుగులు పెట్టిన సిబ్బంది

May 12, 2022

మన దగ్గర అంటే కొత్తగా ఉంటుంది కానీ, విదేశాల్లో ప్రయాణీకులు ఎక్కడికైనా వెళ్తే తమతో పాటు తమ పెంపుడు జంతువులను కూడా తీసుకెళ్తుంటారు. ఈ క్రమంలో విమాన ప్రయాణం చేస్తున్న ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను వెంట తీసుకెళ్లాడు. చివరి నిమిషంలో అది తాడు తెంచుకొని పరుగులు పెట్టడంతో దాని వెంబడి సిబ్బంది కూడా పరుగులు పెట్టి ఎట్టకేలకు పట్టుకున్నారు.

ఈ తతంగాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ అవుతోంది. అమెరికాలో జరిగిన ఈ సంఘటన వివరాలు.. మిగ్వుల్ హిడాల్గొ వై కాస్టిల్లా అనే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ కుటుంబం తమ పెంపుడు కుక్కను వెంటబెట్టుకొచ్చింది. బోర్డింగ్ సమయం దగ్గర పడుతుండగా, హఠాత్తుగా కుక్క తాడు తెంచుకొని రన్‌వేపై పరుగులు పెట్టింది. సెక్యూరిటీ సిబ్బంది వెంటపడ్డా అందరినీ తప్పించుకొని ఆ ప్రాంతమంతా స్వేచ్ఛగా తిరిగింది. చివరికి ఎలాగోలా కుక్కను సిబ్బంది పట్టుకోగలిగారు. ఈ క్రమంలో ఎవరికీ ఎలాంటి గాయం కాలేదు. కాగా, సెక్యూరిటీ సిబ్బందికి కుక్క మంచి వ్యాయామం చేయించిందని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.