The dream came true..I found Lord Shani..
mictv telugu

కల నిజమైంది..శని దేవుడు దొరికాడు..

August 17, 2022

మహారాష్ట్రలోని శ్రీరాంపూర్ తాలూకా తక్లిభాన్‌ గ్రామానికి చెందిన రాజ్‌వాడ ప్రాంతంలో జరిగిన ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. రాజ్‌వాడలో నివాసం ఉంటున్న శివాజీరావు ధుమాల్‌ అనే రైతుకు ఓ రాత్రి శని దేవుడు కలలో కనిపించి, ”ఊరి చివర ఉన్న పాత కోట సమీపంలో నా విగ్రహం ఉంది. దాన్ని నువ్వు వెలికి తీయాలి” అని కోరాడు. తెల్లవారుజామున శివాజీరావు..అది కల కదా అని అనుకున్నాడు. కాసేపటికి అది నిజంగా ఆ దేవుడే వచ్చి చెప్పడేమో అని, కంగారు పడుతూ..ఆ కల గురించి గ్రామంలోని విఠల్ ఆలయ పూజారి రాజేంద్ర దేవల్కర్‌ కు, గ్రామ పెద్దలకు తెలియజేశాడు. దాంతో వారంతా కలిసి ఊరి చివర్లో ఉన్న పాత కోటకు వెళ్లారు.

అక్కడ కలలో శని దేవుడు కనిపించి, చెప్పిన మాటలు నిజమైయ్యాయి. ఆ కోట సమీపంలో శని దేవుని విగ్రహాన్ని శివాజీరావు, గ్రామ పెద్దలతో కలిసి వెలికి తీశాడు. దాంతో విషయం తెలుసుకున్న చుట్టు పక్కల గ్రామస్థులు ఆ శని దేవుని విగ్రహాన్ని చూడడానికి తండోపతండాలుగా తరలివచ్చి, పూజలు చేస్తున్నారు. ఆ శిల విగ్రహం నుదిటిపై చంద్రవంక ఆకారం చెక్కబడి ఉంది. త్వరలోనే అక్కడ గుడి కట్టి, ఆయనకు నిత్యం పూజలు చేస్తామని గ్రామస్థులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో శని దేవుని విగ్రహా ఫోటోలు వైరల్‌గా మారాయి. ఫోటోలను వీక్షిస్తున్న వారంతా ”మనిషికి కలలు రావడం అనేది కామన్. అందులో కొన్ని మంచి కలలు ఉంటే, ఇంకొన్ని చెడు కలలు ఉంటాయి. తెల్లవారుజూమున వచ్చే కలలు నిజం అవుతాయని కొందరు అంటారు కానీ, అందుకు తగ్గ శాస్త్రీయ ఆధారాలు అయితే ఏమి లేవు. ఇలాంటి ఘటనలు జరగటం చాలా అరుదు” అని పలువురు నెటిజన్స్ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.