కారులో షికారు.. నేల మీద కాదు గాల్లో.. ట్రాఫిక్‌కు చెక్... - MicTv.in - Telugu News
mictv telugu

కారులో షికారు.. నేల మీద కాదు గాల్లో.. ట్రాఫిక్‌కు చెక్…

October 25, 2018

మెట్రో నగరాల్లో ట్రాఫిక్  ఇబ్బందులు అంత ఇంతా కాదు. సగం జీవితం ట్రాఫిక్‌లోనే గడిచిపోతోందని నగరవాసులు నానా హైరానా చెందుతున్నారు. వాహనాదారులు  ట్రాఫిక్‌లో ఇరుక్కున్నప్పుడు ఎగిరే మోటార్ వాహనాలు, కార్లు ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంటుంది. త్వరలోనే నగరవాసుల కల నిజం కానుంది. ఆకాశంలో ఎగరనున్నారు జనాలు.  The driver of the low-flying taxi will take off from Singapore in the next year. కానీ హైదరాబాదులో కాదు సుమా… సింగపూర్‌ నగర వాసులకు ఆ అదృష్టం వరించనుంది. వచ్చే ఏడాది నుంచి గాలిలో ఎగిరే డ్రైవర్‌లెస్ హోవర్ ట్యాక్సీలు టేకాఫ్ కానున్నాయి. ఈ డ్రైవర్ లెస్  హోవర్ ట్యాక్సీలను జర్మనీకి చెందిన కంపెనీ వోలో కాప్టర్ తయారుచేసింది. వచ్చే ఏడాది నుంచి ప్రయోగాత్మకంగా టెస్ట్ చేయనుంది. అచ్చం హెలికాప్టర్ లాగే ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు నేరుగా టేకాఫ్ ,ల్యాండింగ్ అవుతాయి. డ్రోన్ టెక్నాలజీతో పనిచేసే ఈ ట్యాక్సీల్లో ఇద్దరు వ్యక్తులు 30 కిలోమీటర్ల వరకు హాయిగా ప్రయాణించవచ్చు. నగరాల్లో ప్రయాణించేందుకు వీలుగా తయారుచేశామని, స్కై స్క్రాపర్లు అడ్డు తగలకుండా వంద మీటర్ల ఎత్తులో ఎగురుతాయని వోలోకాప్టర్ కంపెనీ చెప్పింది. హోవర్ ట్యాక్సీలను జాయ్ స్టిక్ లేదా రిమోట్ గ్రౌండ్‌లో ఉండి ఆపరేటింగ్ చేయనున్నారు.