బస్సును వెంటాడిని ఏనుగు..జస్ట్ మిస్..(వీడియో)
మీరు నాకు ఎదురొచ్చిన మీకే రిస్క్.. నేను మీకు ఎదురొచ్చిన మీకే రిస్కు అంటోంది ఓ గజరాజు. కేరళలోని చాలకుడి నుంచి వాల్పరాయ్ మార్గంలో ఓ ఏనుగు ప్రజలను భయపెడుతోంది. ఆ మార్గంలో ఎవరూ వెళ్లినా వెంటాడి పరుగులు పెట్టిస్తోంది. తాజాగా ఓ బస్సును వెంటాడంతో సుమారు 8 కి.మీ. ఆ బస్సు డ్రైవర్ వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
Kabaali, the infamous tusker in chalakudy forests of Kerala charging against a private bus forcing the bus driver to drive over 8 kms in the reverse direction despite the road having plenty of sharp turns and bends😵…..👏👏👏kudos to the brave driver Shri Ambujakshan pic.twitter.com/a95PshaCfo
— Mathew George (@Matblore) November 17, 2022
కేరళలోని చాలకుడి నుంచి వాల్పరాయ్ మార్గంలో ఓ ప్రైవేట్ బస్సు 40 మంది టూరిస్టులతో వెళ్తోంది. సరదాగా వెళ్తున్న వారికి రోడ్డుపై ఓ ఏనుగు కనిపించింది. కాసేపు అయ్యాకు పోతాది అనుకుంటే ఒక్కసారిగా బస్సువైపు కోపంతో దూసుకొచ్చింది. దీంతో అందరూ భయానికి గురయ్యారు. చేసేది ఏం లేక రివర్స్ గేర్ వేసి బస్సును వెనక్కు పోనిచ్చాడు డ్రైవర్. సుమారు ఎనిమిది కిలోమీటర్లు మేర బస్సు వెనక్కివెల్లింది. చివరికి ఓ గ్రామం వద్ద ఏనుగు అడివిలోకి వెళ్ళిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మలుపులు ఉన్న ఇరుకు రోడ్డులో బస్సును డ్రైవర్ చాకచక్యంగా నడిపాడు. 40 మంది పర్యాటకుల ప్రాణాలను కాపాడిన ఆ డ్రైవర్‌పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. కేరళ, తమిళనాడు సరిహద్దులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
हाथी से बचने के लिए रिवर्स में दौड़ाई बस: 8 किमी तक पीछा किया, ड्राइवर ने 40 से अधिक यात्रियों की जान बचाईhttps://t.co/7Xc7pFnu7a#Kerala #Elephant #viral pic.twitter.com/4ndQwEtvKx
— Dainik Bhaskar (@DainikBhaskar) November 16, 2022
తన జీవితంలో ఇలాంటి ఘటనను ఎప్పుడూ చూడలేదని డ్రైవర్ అంబుజాక్షన్ తెలిపాడు. ఎన్నో సార్లు అడవిమార్గంలో వెళ్లినా ఇలా జరగలేదని చెప్పాడు. ఏనుగు వెంటాడడంతో బస్సులో ప్రయాణికులు భయపడిపోయారని..బస్సును వెనక్కు తీసుకురావడం తప్ప మాకు మరో మార్గం కనిపించలేదని వెల్లడించాడు. ఆ ఏనుగు పేరు కబాలి అని రెండేళ్లుగా అది ఇలాగే చేస్తోందని స్థానికులు పేర్కొన్నారు. ఎవరైనా ఎదురపడితే ఇలానే భయపెడుతందని తెలిపారు.