వీడిన ఉత్కంఠ.. ప్రమాణం చేసిన కొత్త మంత్రులు - MicTv.in - Telugu News
mictv telugu

వీడిన ఉత్కంఠ.. ప్రమాణం చేసిన కొత్త మంత్రులు

April 11, 2022

jagan

ఆంధ్రప్రదేశ్‌లో గతకొన్ని రోజులుగా కొత్త మంత్రుల విషయంలో నెలకొన్న ఉత్కంఠ నేటీతో ముగిసింది. కొత్త మంత్రులుగా ఎవరు ప్రమాణం చేయనున్నారు? పాత మంత్రులలో ఎంతమందికి మళ్లీ అవకాశం ఇయనున్నారు? అనే పలు కీలక అంశాలకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం ఆంగ్ల అక్షర క్రమంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమయింది. జగన్ సమక్షంలో కొత్త మంత్రుల చేత గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రమాణం చేయించారు. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి.. 34 నెలల 2 రోజులు అయింది. ఈ తరుణంలో కొత్త మంత్రివర్గం నేడు ఏర్పడింది. అయితే, ఈ తాజా కేబినెట్‌లో 11 మంది పాత మంత్రులకు మళ్లీ అవకాశం దక్కింది. అంతేకాకుండా కొత్తగా 14 మందికి జగన్ అవకాశం ఇచ్చారు. అంటే మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణం స్వీకారం చేశారు.

అయితే, తొలుత అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అంజాద్ బాషా, ఆదిమూలపు సురేశ్, బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తదితరులు వరుసగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే గవర్నర్, ముఖ్యమంత్రి, కొత్త మంత్రులతో కలిసి గ్రూపు ఫొటో దిగనున్నారు. అనంతరం సచివాలయంలో గవర్నర్, కొత్త మంత్రులకు, పాత మంత్రులకు, అధికారులకు జగన్ మోహన్ రెడ్డి తేనీటి విందు ఏర్పాటు చేశారు.