వెబ్‌సిరీస్‌లోకి సమంత కూడా..  - MicTv.in - Telugu News
mictv telugu

 వెబ్‌సిరీస్‌లోకి సమంత కూడా.. 

November 28, 2019

'The Family Man' S2 commences shooting, Samantha Akkineni to make digital debut

సినిమా తారలు వెబ్‌సిరీస్‌లలో నటించడం ఇప్పుడు సరికొత్త ట్రెండ్. ఎలాంటి సెన్సారూ లేకపోవడంతో అవి జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. నటీనటులకు కూడా డబ్బులు బాగానే ముడుతున్నాయి. అటు సినిమాలు చేసుకుంటూనే ఇటు వెబ్‌సిరీస్‌లలో నటించేస్తున్నారు.  తాజాగా ఆ కోవలోకి టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత అక్కినేని కూడా చేరిపోయారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్2 లో ఆమె నటిస్తోంది. ఈ విషయాన్ని దర్శక ద్వయం రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే ట్విటర్‌లో ప్రకటించారు. సమంత పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని వారు పేర్కొన్నారు. ‘సీజన్‌ 2 షూటింగ్‌ ప్రారంభమైంది. ప్రస్తుతం శ్రీకాంత్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి టూర్‌కు వెళ్లాడు. త్వరలోనే తాను వస్తాడని మేము ప్రామిస్‌ చేస్తున్నాం’ అని తెలిపారు. గురువారం నుంచి ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్ ప్రారంభమైంది. 

 

మరోవైపు సమంత కూడా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఇందుకు సంబంధించి ఓ పోస్ట్‌ పెట్టారు. ‘నేను నటించబోతున్న మొదటి వెబ్‌‌సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’. దీని కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఓ డ్రీమ్‌ రోల్‌ను నాకు ఇచ్చినందుకు ప్రతిఒక్కరికీ నా ధన్యవాదాలు’ అని సమంత వెల్లడించారు.

సీజన్ 1లో బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పేయి ముఖ్య పాత్రలో నటించాడు. మధ్య తరగతికి చెందిన ఓ వ్యక్తి జాతీయ దర్యాప్తు సంస్థకు ఏజెంట్‌గా పనిచేస్తాడు. సెప్టెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెబ్‌‌సిరీస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో ప్రియమణి, నీరజ్‌ మాధవ్‌, పవన్‌ చోప్రా, కిషోర్‌ కుమార్‌ తదితరులు నటించారు.