పెద్దకర్మకు ఏర్పాట్లు చేస్తుండగా.. చనిపోయాడుకున్న వ్యక్తి ప్రత్యక్షం - MicTv.in - Telugu News
mictv telugu

పెద్దకర్మకు ఏర్పాట్లు చేస్తుండగా.. చనిపోయాడుకున్న వ్యక్తి ప్రత్యక్షం

July 29, 2022

రైలు ప్రమాదంలో చనిపోయాడనుకున్న వ్యక్తి హఠాత్తుగా పెద్దకర్మ ముందు రోజు ప్రత్యక్షమయ్యేసరికి ఇంట్లో వాళ్లంతా షాక్ అయ్యారు. పెద్ద కర్మకు అన్ని ఏర్పాట్లు చేస్తుండగా.. ఇంటికొచ్చిన వ్యక్తిని చూసి ఒక్క క్షణం కంగారు పడ్డారు. ఆ షాక్ నుంచి తేరుకుని కళ్లెదురుగా ఉన్నది మనిషేనని నిర్ధారించుకున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడుకు చెందిన సయ్యద్‌మియాకు భార్య రహమత్‌బీ, కుమార్తె ఉన్నారు. కొన్నాళ్లు మిలటరీలో పనిచేసిన సయ్యద్.. మద్యానికి బానిసై మధ్యలోనే తిరిగొచ్చాడు. ఆర్మీ ఉద్యోగం వదిలేసి లారీ క్లీనర్‌గా వెళుతున్నాడు. ఆ తర్వాత భార్యాభర్తలు తరచూ గొడవలు పడి విడిపోయారు. అప్పటినుంచి రహమత్‌బీ తన కుమార్తెతో కలిసి తన పుట్టింట్లో ఉంటోంది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటోన్న సయ్యద్‌మియా లారీ క్లీనర్‌గా వెళ్లి 2, 3 నెలల వరకూ వచ్చేవాడు కాదు. ఈ క్రమంలోనే అతడు చాలా రోజులు ఇంటికి రాలేదు.

గత నెల 19న మార్కాపురం సమీపంలో రైలు కిందపడి ఒక వ్యక్తి చనిపోయాడు. అయితే పోలీసులు చెప్పిన ఆనవాళ్లు దగ్గరగా ఉండటంతో చనిపోయిన వ్యక్తి సయ్యద్‌మియా అనుకున్నారు. కుటుంబ సభ్యులు అక్కడే మృతదేహాన్ని ఖననం చేసి.. ఇంట్లో కూడా కర్మకాండలు జరిపారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం శుక్రవారం 40వరోజు పెద్దకర్మకు ఏర్పాట్లు చేశారు. ఇంతలో మియా ఇంట్లో ప్రత్యక్షం అయ్యాయడు. ఆయన్ను చూసి కుటుంబం అవాక్కైంది. రెండు నెలల క్రితం మాయమైన సయ్యద్‌మియాను బంధువులు గుర్తించి తీసుకువచ్చారు. చనిపోయాడనుకున్న వ్యక్తి ప్రత్యక్షం కావడంతో కుటుంబసభ్యులు సంతోషించారు.