The farmers are protesting against the Shivamogga airport which is going to be inaugurated by Prime Minister Modi soon
mictv telugu

Bengaluru: శివమొగ్గ ఎయిర్‎పోర్టుకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు!!

February 22, 2023

కర్నాటకలోని శివమొగ్గలో రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు. ఈ నెల 27న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభిచనున్న శివమొగ్గ ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టారు. ప్రారంభోత్సవానికి ముందే ఎయిర్ పోర్టులో కన్నడ డిస్ప్లే బోర్డులులేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన డిస్ ప్లే బోర్డులో కేవలం హిందీ,ఇంగ్లీష్ మాత్రమే ఉండటంతో కన్నడ ఉద్యమకారులు అధికారులపై మండిపడ్డారు. దీనితోపాటుగా రైతుల భూముల విషయంలో సమస్యలు కూడా తెరపైకి వచ్చాయి.

కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీధుగా శివమొగ్గలో నిర్మించిన విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో సేకరించిన భూమికి పరిహారం చెల్లించడంలో అధికారులు విఫలమయ్యారని రైతులు ఆందోళన చేపట్టారు. విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని వ్యతిరేకిస్తూ రైతులు, డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. విమానశ్రాయం కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. రైతులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చిందని..వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నరాు. ఎనిమిది మంది రైతులకు సంబంధించి రూ. 10కోట్ల పరిహారం జిల్లా కలెక్టర్ కు చేరిందని..ఇప్పటివరకు ఆ నష్టపరిహారం రైతులకు ఇవ్వకుండా వారితో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.