కిమ్ రాజ్యంలో కరోనా.. వారంలో పది లక్షలు - MicTv.in - Telugu News
mictv telugu

కిమ్ రాజ్యంలో కరోనా.. వారంలో పది లక్షలు

May 16, 2022

కిమ్ జోంగ్ ఉన్ పరిపాలిస్తున్న ఉత్తరకొరియాలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత వారం ఒక్క కేసు మాత్రమే నమోదవగా, ఈ వారం వచ్చేసరికి కేసుల సంఖ్య భారీగా పెరిగి 10 లక్షలకు చేరింది. 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 5 లక్షల 64 వేల మంది క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ మీడియా అధికారికంగా వెల్లడించింది. దీంతో కరోనా ఎంత వేగంగా వ్యాప్తి చెందిందో అర్ధం చేసుకోవచ్చు.

పలు దేశాలు వ్యాక్సిన్ ఆఫర్ చేసినా, లాక్ డౌన్, సరిహద్దుల మూసివేతలతో కరోనాను కట్టడి చేస్తానని కిమ్ పట్టుదలగా ఉన్నాడు. దాదాపు రెండున్నర కోట్ల జనాభా ఉన్న ఉత్తరకొరియాలో ఆరోగ్య వ్యవస్థ సరిగ్గా లేని కారణంగా కేసులు ఇంకా పెరుగుతాయని భావిస్తున్నారు. ఈ క్రమంలో కిమ్ అధికారులతో అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేశారు. కరోనా కట్టడికి సైన్యాన్ని రంగంలోకి దింపడంతో పాటు సైన్యపు మెడికల్ సిబ్బందిని వినియోగించనున్నారు. ముఖ్యంగా రాజధాని నగరమైన ప్యాంగ్యాంగ్‌కు ఎలాంటి కొరత రాకుండా చూడాలని కిమ్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఉత్తర కొరియా కోరితే ఎంతటి సహాయమైనా చేస్తామని సోదర దేశమైన దక్షిణ కొరియా ప్రకటించింది.