ఏలూరు : ప్రేమ జంటపై దాడి.. భర్త చెవి కొరికేశారు - MicTv.in - Telugu News
mictv telugu

ఏలూరు : ప్రేమ జంటపై దాడి.. భర్త చెవి కొరికేశారు

May 24, 2022

ఏలూరు జిల్లాలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువ జంటపై యువతి తండ్రి, తమ్ముడు దాడి చేశారు. ద్వారకా తిరుమల మండలం, ఎం నాగులపల్లిలోని ఓ రెస్టారెంటులో ఈ దాడి జరిగింది. వివరాలు.. దెందలూరు మండలం చల్ల చింతలపూడి గ్రామానికి చెందిన సాంబశివరాలు, పావనిలు మూడు నెలల క్రితం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. దీంతో పావని కుటుంబ సభ్యులు అవమాన భారంతో రగిలిపోయారు. ఎలాగైనా వారిని విడదీయాలనే ఉద్దేశంతో వారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో రహస్యంగా తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఓ రెస్టారెంటులో ఉన్నారనే సమచారంతో అక్కడికి వెళ్లి పావని భర్త సాంబశివరావుపై దాడి చేశారు. ముందుగా సాంబశివరావు తలను టేబుల్ కేసి కొట్టారు. అదే ఊపులో చెవి కొరికేసి అనంతరం కర్రలతో దాడి చేశారు. దీంతో గాయపడిన ప్రేమజంట ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.