డైలాగులు, డ్యాన్సులు, పర్ఫార్మెన్స్ లతో థియేటర్లు దద్దరిల్లి పోవడం చూశాం కానీ సంగీతంతో వెండితెరలు కాలిపోవడం మాత్రం కొత్తగా చూస్తున్నాం. దీనికి సంగీత దర్శకుడు తమన్ ఆద్యుడిగా నిలిచారు. బాలయ్య నటించే చిత్రాలకు ఓ రేంజులో మ్యూజిక్ ఇచ్చే తమన్.. వీరసింహారెడ్డి సినిమాకు కూడా అదిరిపోయే బ్యాగ్రౌండ్ ఇచ్చాడు. ఇక ఇంటర్వెల్ సీన్లకయితే థియేటర్లో పూనకాలు వచ్చే స్థాయిలో దంచేశాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. తమన్ మ్యూజిక్ దెబ్బకు ఏకంగా థియేటర్లో అగ్నిప్రమాదం జరిగింది. విశాఖపట్నం జిల్లా సబ్బవరం టౌన్ లో ఉన్న ఓ థియేటర్లో సినిమా ప్రదర్శితం అవుతుండగా ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది.
దీనికి మ్యూజికే కారణమని తేల్చేశారు. అయితే థియేటర్లోని సౌండ్ సిస్టంలోనే సమస్య వచ్చిందంట. దీంతో హీట్ ఎక్కువై తెర వెనకాల నుంచి మంటలు వ్యాపించాయి. గమనించిన యాజమాన్యం వెంటనే సినిమాను ఆపేయగా, ప్రేక్షకులు సురక్షితంగా బయటికి వచ్చేశారు. గతంలో బాలయ్య నటించిన అఖండ సినిమాకు కూడా ఇలాంటి ఇబ్బందులే వచ్చాయి. ఈ సారి కూడా ఇలా జరిగే ప్రమాదముందని, థియేటర్ యజమానులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తమన్ ముందే హెచ్చరించాడు. అయినప్పటికీ ప్రమాదం జరగడంతో తమన్ మ్యూజిక్కా.. మజాకా.. అని చర్చించుకుంటున్నారు.
Ayyo 🙄, #Thaman Anna Mundhe Warning icharu kadha 🔊🤙
Theaters vallu Chuskovali gaa 😁🔥 #VeeraSimhaReddy @megopichand @MusicThaman Oocha Kotha ante ani Live ga Chupincharu 😎😅🥁💥 pic.twitter.com/L0NVlv7xMo
— ⚓ AmruthVarsh ⚓ (@Dhoni_Varsh) January 12, 2023