మొదటగా ఈ శాఖల్లోనే నోటిఫికేషన్లు : సబితా ఇంద్రారెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

మొదటగా ఈ శాఖల్లోనే నోటిఫికేషన్లు : సబితా ఇంద్రారెడ్డి

April 22, 2022

28

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు ఉద్యోగాలకు ప్రకటన వెలువడుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించినా రోజునుంచి నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడటం మొదలుపెట్టారు. మరికొంతమంది కోచింగ్ సెంట్లర బాటపట్టారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నా అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది.

మొదటగా ఏఏ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తామో అన్న విషయాన్ని శుక్రవారం తెలిపింది. మొదటగా.. పోలీస్‌, వైద్య, విద్య శాఖల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కేసీఆర్‌ ఆదేశించినట్లు ఆమె వెల్లడించారు. ఈ మూడు శాఖల్లో సుమారు 72,000 ఉద్యోగాలు భర్తీ కానున్నాయని అన్నారు. ఇలా నోటిఫికేషన్లు ఇవ్వటం వల్ల నిరుద్యోగులకు ఒక ఉద్యోగం రాకపోతే, మరో ఉద్యోగానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది అని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం 91 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటన చేసే ముందు ఎంతో కసరత్తు చేసిందని తెలిపారు.

మరోపక్క గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి ఇప్ప‌టికే అధికారులు క‌స‌ర‌త్తు దాదాపుగా పూర్తి చేశారు. అయితే, తాజా స‌మాచారం ప్ర‌కారం గ్రూప్‌ 1 నోటి‌ఫి‌కే‌షన్‌ విడు‌ద‌లపై టీఎ‌స్‌‌పీ‌ఎస్సీ శని‌వారం కీలక నిర్ణయం తీసు‌కునే అవ‌కాశం ఉంది. రేపే తెలంగాణలో నోటిఫికేషన్లు ఎప్పుటి నుంచి ప్రారంభం కానున్నాయి అనే విషయాలపై అధికారులు క్లారిటీ ఇవ్వనున్నారు.