పట్టాలెక్కిన తొలి ప్రైవేట్ రైలు.. ఈ రైలు ఐదు గంటలు - MicTv.in - Telugu News
mictv telugu

పట్టాలెక్కిన తొలి ప్రైవేట్ రైలు.. ఈ రైలు ఐదు గంటలు

June 15, 2022

భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఓ ప్రైవేట్ రైలు పట్టాలు లెక్కిందని దక్షిణ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ‘భారత్ గౌరవ్ పథకం’ కింద తొలిసారిగా ఈ ప్రైవేటు రైలును తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు నార్త్ నుంచి సాయినగర్ వరకు నడిపించిందని పేర్కొంది. అయిదు రోజులపాటు ప్యాకేజ్ టూర్ కింద ఈ రైలులో ప్రయాణించవచ్చని దక్షిణ రైల్వే శాఖ తెలిపింది.

”1100 మంది ప్రయాణికులతో ‘దేఖో అప్నా దేశ్ పేరిట మంగళవారం సాయంత్రం 6 గంటలకు కోయంబత్తూరు నార్త్‌ నుంచి బయలుదేరింది. 16వ తేదీ ఉదయం 7.25 గంటలకు సాయినగర్ శిర్డీకి చేరుతుంది. తిరుపూరు, ఈరోడ్, సేలం, ఎలహంక, ధర్మవరం, మంత్రాలయం రోడ్, వాడి మీదుగా ఈ రైలు వెళ్తుంది. కోయంబత్తూరు నుంచి వెళ్లేటప్పుడు మంత్రాలయం రోడ్డులో మంత్రాలయం ఆలయ సందర్శనార్ధం అయిదు గంటల పాటు ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో సాయినగర్ శిర్డీలో 17వ తేదీ ఉదయం 7.25 గంటలకు బయలుదేరి కోయంబత్తూరు నార్త్ కు 18న మధ్యాహ్నం 12 గంటలకు చేరుతుంది. వాడి, ధర్మవరం, ఎలహంక, సేలం, ఈరోడ్, తిరుపూరు స్టేషన్లలో ఆగుతుంది.”

ఈ ప్రైవేట్ రైలును ఆధునిక హంగులతో అధికారులు బోగీలను తయారుచేశారు. అంతేకాకుండా ఈ రైలులో పోలీసులతో పాటు, ఓ ప్రైవేటు భద్రతా సిబ్బంది, ఏసీ మెకానిక్, అగ్నిమాపక సిబ్బంది ఉంటారని పేర్కొంది. రుచికరమైన శాఖాహార వంటకాలు, ప్యాకేజీలో భాగంగా వీఐపీ దర్శనం, బస్సు వసతులు, ఏసీ బస వసతితో పాటు టూరిస్టు గైడ్లను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.