The first version of the iPhone sold for a huge price at auction
mictv telugu

పదిహేనేళ్ల పాత ఐఫోన్‌కు భారీ ధర.. స్పెషాలిటీ చూస్తే షాకవుతారు

October 17, 2022

The first versiThe first version of the iPhone sold for a huge price at auctionon of the iPhone sold for a huge price at auction

గాడ్జెట్ ప్రేమికులకు ఐఫోన్ అంటే ఎంత ప్రేమో వేరే చెప్పక్కర్లేదు. లేటెస్ట్ వెర్షన్ విడుదల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు. ధర ఎంతున్నా వెనక్కి తగ్గక ఐఫోన్ల కోసం క్యూలో గంటల తరబడి ఓపికగా నిల్చుంటారు.

అయితే ఐఫోన్ మొదటి వెర్షన్ 2007లో విడుదలైంది. పదిహేనేళ్ల క్రితం విడుదలైన ఓజీ వెర్షన్ ఐఫోన్ ఒకదాన్ని వేలం వేయగా, 60 రెట్ల ఎక్కువ ధరకు అమ్ముడోపోయింది. 2007లో ఈ ఫోన్ ధర 499-599 డాలర్ల మధ్య ఉండగా, మన కరెన్సీలో చూస్తే రూ. 40 నుంచి 50 వేల వరకు ఉంటుంది. కానీ వేలంలో మాత్రం ఏకంగా రూ.32,31,791 లక్షలకు అమ్ముడుపోయింది. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఎల్‌సీజీ ఆక్షన్స్ ఆదివారం జరిగిన వేలంలో భారీ ధరకు దక్కించుకుంది. అయితే 2022 వరకు ఐఫోన్ సిరీస్‌లో 14 మోడళ్లు రాగా, ఈ పాత వెర్షన్‌కు ఎందుకంత ధర పలికిందనే అంశం ఆసక్తిగా మారింది. అయితే ఈ ఫోన్‌ను విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఓపెన్ చేయలేదని, ఫోన్ పనితీరు చాలా బాగుందని నిర్వాహకులు తెలిపారు. ఫీచర్లు చూస్తే 2 మెగా పిక్సల్ కెమెరా, 4/8 జీబీ స్టోరేజీ, టచ్ స్క్రీన్, వెబ్ బ్రౌజర్ ఉన్నాయి. ఎలాంటి లోపాలు లేకపోవడంతో ఇంత ధర పలికిందని చెప్తున్నారు.