తప్పయిపోయిందని చెప్పుతో కొట్టుకున్న ఏపీ మాజీ మంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

తప్పయిపోయిందని చెప్పుతో కొట్టుకున్న ఏపీ మాజీ మంత్రి

March 2, 2022

bhtdh

నరసాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రసాదరాజును గెలిపించి తప్పు చేశానని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి  సుబ్బారాయుడు చెప్పుతో కొట్టుకున్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. నరసాపురంలో జిల్లా కేంద్రం ఏర్పాటు లక్ష్యంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గం కోసం ఏ మాత్రం ప్రయత్నం చేయని,

 

అసమర్ధ ఎమ్మల్యే అని మండిపడ్డారు. ఎన్నికల్లో వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం కలిసి పని చేశాననీ, అప్పుడే తెలిస్తే ఇలాంటి వ్యక్తికి సీటు రాకుండా ప్రజలు అడ్డకునేవారన్నారు. ఇలా మాట్లాడుతుండగానే, పక్కన ఉన్న వారు వారిస్తున్నా మాజీ మంత్రి అలా చెప్పుతో కొట్టుకోవడం స్థానికంగా సంచలనం రేపింది. కాగా, ఇప్పటికే నరసాపురం ఎంపీ రఘురామ రాజు వ్యవహారం పార్టీని ఇబ్బంది పెట్టగా, ఇప్పుడు అదే నియోజకవర్గం, అదే పార్టీలో ఇద్దరు నేతల మధ్య విభేదాలు
బహిరంగమవడం ఆ పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది.