నేడు అంత్యక్రియలు… మన్యం 3రోజులు బంద్ - MicTv.in - Telugu News
mictv telugu

నేడు అంత్యక్రియలు… మన్యం 3రోజులు బంద్

September 24, 2018

మావోయిస్టుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. కిడారి సర్వేశ్వరరావు స్వగ్రామం పాడేరు కావడంతో అక్కడే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. సివేరు సోమకు అరకులో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాత్రిపూట పోస్ట్ మార్టం నిర్వహించడంపై కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారని తెలుస్తోంది.The funeral today ... the manyam is banded for 3 daysఇదిలా వుండగా ఈ హత్యలకు నిరసనగా సోమవారం నుంచి మూడు రోజులపాటు మన్యం బంద్‌కు పిలుపిచ్చినట్టు గిరిజన ఉద్యోగుల సంఘం నేత‌లు ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఇటువంటి చర్యలు అత్యంత హేయమైనవని అన్నారు. మన్యంలో ప్రజాప్రతినిధులకు రక్షణ లేనప్పుడు ఇంకెవరు ముందుకు వస్తారని ప్రశ్నించారు. నందాపూర్ ఏరియా న‌క్స‌లైట్ కమిటీ ఈ దాడికి పాల్ప‌డ్డారని పోలీసులు నిర్ధారించారు.