సినిమా ఛాన్సులు ఇప్పిస్తానని యువతిని వాడుకుని.. కులం తక్కువని.. - MicTv.in - Telugu News
mictv telugu

సినిమా ఛాన్సులు ఇప్పిస్తానని యువతిని వాడుకుని.. కులం తక్కువని..

March 15, 2019

మనం మోసపోవడానికి రెడీగా వున్నంతకాలం మోసగాళ్ళకు కొదవ వుండదు. మన అమాయకత్వాన్ని వారు క్యాష్ చేసుకుంటారు. అందుకే చాలా జాగ్రత్తగా వుండాలి. ముఖ్యంగా అమ్మాయిలు చాలా జగ్రత్తగా, అంతకన్నా ఎక్కువ తెలివిగా వుండాలి. లేకపోతే పెళ్లి పేరుతో తమ కామవాంఛ తీర్చుకుని పారిపోతారు కొందరు నీచులు. అవకాశాల కోసం దిగజారకపోవడం మంచిదేమో. ఇదీ అలాంటి ఘటనే. సినిమాల్లో రాణించాలనుకుంది ఆ అమ్మాయి. ఈ క్రమంలో ఓ ప్రకటన చూసి వాళ్లను కలిసింది. ఇంకే అందమైన అమ్మాయిలు ఎప్పుడు వస్తారా అని మాటువేసి కూర్చున్న ఆ గుంట నక్క ఆమెకు మాయ మాటలు చెప్పాడు. శారీరకంగా లోబరుచుకున్నాడు. తన పబ్బం గడిచింది కాబట్టి కులం పేరుతో ఎస్కేప్ అవుదామనుకున్నాడు. కానీ అమ్మాయి ఊరుకోలేదు. పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతణ్ణి అరెస్ట్ చేశారు.

The girl used to make cinema chanses.. Caste less

ఈ ఘటన మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్‌కు చెందిన యువతి(24)కి సినిమాల్లో రాణించాలని కోరిక. ఈ క్రమంలో ఆమెకు ఎవరిని కలవాలో తెలియదు. ఓ సినిమాలో సైడ్ డాన్సర్లు కావాలనే ప్రకటన ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి వెళ్లి వాళ్లను కలిసింది. ఆ ప్రకటన మహబూబ్ పేరిట వుంది. మహబూబ్ స్టూడియోకు వెళ్లి కలిసింది. అక్కడ పనిచేస్తున్న షణ్మఖ్ వినయ్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. వారి పరిచయం కాస్తా వారిద్దరూ తరుచూ ఫోన్‌లో మాట్లాడుకునే వరకు పోయింది. ఎలాగైనా సినిమాలో రాణించాలనుకున్న ఆ యువతి మాటలను ఆసరాగా తీసుకొని తనకు సినిమాల్లో చాలా మంది తెలుసని, వారితోపాటు తన స్నేహితులను కూడా పరిచయం చేస్తానని ఫోన్‌లో చెప్పాడు. అతని మాటలు పూర్తిగా నమ్మిందా యువతి.

ఓరోజు అమీర్‌పేట్‌ నుంచి షణ్ముఖ్‌వినయ్‌ ఆమెకు ఫోన్‌ చేసి పిలిపించుకుని బైక్‌పై మాదాపూర్‌లోని ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. తాను చెప్పినట్లు చేస్తే పెండ్లి చేసుకుంటానని నమ్మించి తన శారీరక వాంఛ తీర్చుకున్నాడు. ఆ తరువాత ఫోన్‌లో పెండ్లి ప్రస్తావన తీసుకురాగానే బుకాయించేవాడు. దీంతో చేసేదిలేక మహబూబ్‌ స్టూడియో వద్దకు వచ్చి షణ్ముఖ్‌ను నిలదీసింది. దీంతో ఆమెను తప్పించుకోవడానికి నీ కులం వేరు కాబట్టి పెండ్లి చేసుకోవడం కుదరదని చెప్పాడు. శారీరకంగా వాడుకున్నప్పుడు కులం అడ్డు రాలేదా అని ఆ యువతి నిలదీసింది. అతను నోరు పెదపలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ నెల 11న మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని ఈనెల 13వ తేదీన నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

సిర్‌గూడి షణ్ముఖ్ వినయ్‌ది(24) విశాఖపట్నంలోని సీతమ్మధార. సినిమా పరిశ్రమలో రాణించాలనే ఉద్దేశంతో ఏడాది క్రితం మాదాపూర్‌లోని మస్తాన్‌నగర్‌కు వచ్చాడు. స్టూడియోల చుట్టూ తిరిగి చివరకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న మహబూబ్‌ వద్ద పనిచేస్తున్నాడు.