టెన్త్ ఎగ్జామ్ రాయకుండా తండ్రి అడ్డు.. కూతురు ఏం చేసిందో తెలిస్తే షాక్ - MicTv.in - Telugu News
mictv telugu

టెన్త్ ఎగ్జామ్ రాయకుండా తండ్రి అడ్డు.. కూతురు ఏం చేసిందో తెలిస్తే షాక్

May 4, 2022

ఓ తండ్రి పదవ తరగతి పరీక్షలు రాస్తున్న తన కూతురుని పరీక్ష కేంద్రానికి వెళ్లనీయకుండా ఓ గధిలో బంధించాడు. పరీక్ష రాయడానికి వీల్లేదని పట్టుబట్టాడు. అనంతరం గదిలో ఉన్న బాలికకు మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. దాంతో తండ్రి నుంచి బయటపడి వెళ్లి పరీక్ష రాసింది. వివరాలు.. అన్నమయ్య జిల్లాలోని రామాపురం మండలం కల్పనాయుని చెరుకు గ్రామపంచాయితీ పరిధిలోని మూగిరెడ్డిగారి పల్లెకు చెందిన బాలిక టెన్త్ చదువుతోంది. ప్రస్తుతం పరీక్షలు జరుగుతుండగా, నీలకంటరావుపేటలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పరీక్షలు రాస్తోంది. ఇప్పటివరకు మూడు పరీక్షలు రాసింది. ఇంతలో తండ్రి నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. పరీక్షలు రాయడానికి వెళ్లొద్దంటూ గదిలో నిర్బంధించాడు. దీంతో బాలిక ఏడుస్తూ కూర్చోకుండా, వెంటనే ఫోనులోని దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. దాంతో హెడ్ కానిస్టేబుల్ ప్రతాప్ వచ్చి బాలికను గదిలో నుంచి బయటకు తీసి పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాడు. దీంతో దిశ యాప్ పనితీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. కాగా, బాలికను తండ్రి ఎందుకు నిర్బంధించాడో తెలియాల్సి ఉంది.