The girls who were beaten to death..the video went viral
mictv telugu

పొట్టుపొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు..వీడియో వైరల్

September 19, 2022

బీహార్‌ రాష్ట్రంలోని ఛప్రా జిల్లాలో తాజాగా జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో అంతలా వైరల్ అవడానికి కారణం ఏమిటని అనుకుంటున్నారా.. ఓ ఇద్దరు అమ్మాయిలు భాయ్‌ఫ్రెండ్ కోసం జుట్లు జుట్లు పట్టుకొని పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే..వాళ్లు ఇద్దరు ప్రేమించిన ఆ వ్యక్తి వారి మధ్యే ఉండటం గమనార్హం. అతడు కొట్టుకోకండి అని ఎంత వేడుకున్నా, ఆ అమ్మాయిలు మాత్రం ఒకరిపై ఒకరికి కోపం తగ్గేవరకు కొట్టుకున్నారు.

 

వీడియోలో ఉన్న ప్రకారం..ఓ కాలనీలో ఇద్దరు అమ్మాయిలు ఒకరిపై ఒకరు చెప్పులతో కొట్టుకుంటున్నారు. జుట్లు జుట్లు పట్టుకొని, పిడుగుద్దులతో పోట్లాడుతున్నారు. వారిని ఆపడానికి ఓ బాలుడు, బాలిక ఉన్నారు. ఎంత ప్రయత్నించిన వాళ్లు మాత్రం కాలనీలో ఉన్నవారిని పట్టించుకోకుండా విపరీతంగా కొట్టుకున్నారు. మధ్యలో ఆపడానికొచ్చిన ఆ భాయ్‌ఫ్రెండ్‌ను సైతం ఓ దెబ్బకొట్టారు. చివరికి ఏమైందో ఏమో తెలియదు గానీ, కోట్లాట ఆగిపోయింది”.

ఇక, వీడియోను వీక్షిస్తున్న నెటిజన్స్..ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘అబ్బాయి కోసం అమ్మాయిలు కొట్టుకోవటం భలేగా ఉంది’ అని కొందరు. మరికొందరు ‘కాలేజీకి వెళ్లి చదువుకుంటున్నారా లేక ఇలానే రోజు కొట్టుకుంటున్నారా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.