The Godfather movie did a business of 90 crore rupees
mictv telugu

గాడ్ ఫాదర్ కి ఆచార్య పాఠాలు.. భారీగా పడిపోయిన మెగా క్రేజ్

October 4, 2022
The Godfather movie did a business of 90 crore rupees
 

పాఠాలు చెప్పగలను, గుణపాఠాలు నేర్పగలను అంటూ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆచార్యుడి నుండి ఎవరు ఏం నేర్చుకున్నారో కానీ గాడ్ ఫాదర్ మేకర్స్ మాత్రం గుణపాఠాలు నేర్చుకున్నట్టు కనిపిస్తుంది. భారీ అంచనాలతో విడుదలైన ఆచార్యకి సుమారుగా 130కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ట్రిపులార్ తరువాత రామ్ చరణ్ చేసిన చిత్రం కూడా కావటంతో ఆచార్యకి భారీ రేటు పలికింది. అయితే బాక్సాఫీస్ దగ్గర కనీసం బ్రేక్ ఈవెన్ కూడా కాలేదు ఆచార్య. దాంతో ఆ ఎఫెక్ట్ గాడ్ ఫాదర్ ప్రీరిలీజ్ పై భారీగానే పడింది. ఆచార్య నుంచి పాఠాలు నేర్చుకున్న బయ్యర్లు.. ఫ్యాన్సీ రేట్లకు గాడ్ ఫాదర్ ని కొనుగోలు చేయకపోవటం గమనార్హం. దాంతో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించినా.. గాడ్ ఫాదర్ కి ఆచార్య కంటే తక్కువ బిజినెస్ జరిగింది.

తాజాగా గాడ్ ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌కి సంబంధించిన లెక్కలు బయటకొచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా 70 కోట్ల మేర బిజినెస్ చేయగా.. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 90 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మెగా ఫ్యామిలీ ప్రధాన బలమైన నైజాం ఏరియా హక్కులు 22 కోట్లు పలుకగా, సీడెడ్ 13.5 కోట్లు, ఆంధ్ర ఏరియా మొత్తం కలిపి 35 కోట్ల బిజినెస్ జరిగింది. అదేవిధంగా కర్ణాటకలో 6.50 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఓవర్సీస్ లో అయితే 7.5 కోట్ల వ్యాపారం జరిగిందని టాక్. మొత్తంగా చూస్తే 90 కోట్ల వరకు బిజినెస్ చేసిన ఈ గాడ్ ఫాదర్.. 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెట్టుకొని రంగంలోకి దిగుతున్నాడు గాడ్ ఫాదర్.