The Golden Canary diamond will be auctioned in New York
mictv telugu

చెత్తకుప్పలో రూ. 124 కోట్ల వజ్రం లభ్యం.. ఎలా దొరికిందో తెలుసా

October 18, 2022

The Golden Canary diamond will be auctioned in New York

ఎంతో కష్టపడి అన్వేషిస్తే తప్ప దొరకని వజ్రాలు ఓ వ్యక్తికి చెత్తకుప్పలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద పసుపు వజ్రం దొరికింది. దాని ఖరీదు చూస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే. సుమారు రూ. 124 కోట్లు పలుకుతుందని నిపుణుల అంచనా. 303.1 క్యారెట్ల బరువు కలిగిన ఈ వజ్రానికి డిసెంబర్‌ ఏడున న్యూయార్క్ సోత్ బీలో వేలం వేయనున్నారు. అయితే ఈ వజ్రం వెనుక ఆసక్తికర కథనం ఉంది. 1980లో పేద దేశమైన కాంగోలో ఈ వజ్రం లభ్యమైంది.

ఎంఐబీఏ అనే వజ్రాల మైనింగ్ కంపెనీ ఆ దేశంలోని వజ్రాల గనిలో తవ్వకాలకు అనుమతి పొందింది. మట్టిని గాలించి, రాళ్లను పరిశీలించి ఏమైనా వజ్రాలు దొరికితే తీసుకుంటుంది. మిగిలిన వ్యర్ధాలను దూరంగా తీసుకెళ్లి పారబోస్తుంది. అయితే ఓ వ్యక్తి తన ఇంటి వెనుక చిన్న గుంత ఉండడంతో మైనింగ్ కంపెనీ పారబోసిన మట్టిని కాంట్రాక్టరుని అడిగి తీసుకెళ్లాడు. ఆ మట్టిని ఇంటి ఆవరణలో పారబోయగా, ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారికి ఈ వజ్రం దొరికింది. మెరుస్తూ ఉండడంతో తీసుకెళ్లి యజమానికి అప్పగించింది. తరచి చూస్తే అది ప్రపంచంలోనే అత్యంత విలువైన, పెద్ద పసుపు వజ్రం ‘గోల్డెన్ కనరీ’గా తేలింది. దాని విలువ తెలియని యజమాని అప్పట్లో తక్కువ రేటుకు అమ్మేశాడు. దొరికినప్పుడు దాని బరువు 890 క్యారెట్లు ఉండడం గమనార్హం. తర్వాత కాలక్రమంలో తరచూ చేతులు మారుతూ సానబెట్టడం వల్ల దాని బరువు మూడో వంతుకు తగ్గిపోయింది. బరువు తగ్గినా విలువ పెరగడంతో వేలంలో భారీ రేటు పలుకుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వజ్రం దుబాయ్‌లోని సోత్ బీలో ప్రదర్శనకు ఉన్న ఈ వజ్రాన్ని సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.