నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ మరో శుభవార్తను తెలిపింది. బుధవారం మరో 3,334 ఉద్యోగ నియమాకాలకు పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు విడివిడిగా జీవోలు జారీ చేశారు.
శాఖల వారీగా పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
1. అటవీ శాఖలో 1,668:
2. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు–1,393,
3. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు– 92,
4. టెక్నికల్ అసిస్టెంట్లు–32,
5. జూనియర్ అటెండెంట్లు– 9,
6. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్–18,
7. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు–14,
8. జూనియర్ అసిస్టెంట్ (లోకల్ కేడర్)–73,
9. జూనియర్ అసిస్టెంట్ (హెడ్ ఆఫీస్)–2,
10. అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎఫ్సీఆర్ఐ)–21,
11. అసోసియేట్ ప్రొఫెసర్ (ఎఫ్సీఆర్ఐ)–4,
12. పీఈటీ (ఎఫ్సీఆర్ఐ)–2,
13. ప్రొఫెసర్– 2,
14. అసిస్టెంట్ కేర్ టేకర్, కేర్‌టేకర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఫామ్ ఫీల్డ్ మేనేజర్, లైబ్రేరియన్, స్టోర్స్ ఎక్విప్మెంట్ మేనేజర్ ఒక్కోపోస్టుగా ఉన్నాయి. అంతేకాకుండా అగ్నిమాపక శాఖలో 861 పోస్టులకు సైతం పచ్చజెండా ఊపారు. అందులో
15. స్టేషన్ ఆఫీసర్లు–26,
16. ఫైర్‌మెన్–610,
17. డ్రైవర్ ఆపరేటర్–225.
బ్రివరీస్ కార్పొరేషన్లో 40…
18. అకౌంట్స్ ఆఫీసర్–5,
19. అసిస్టెంట్స్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్–2లో 7,
20. అసిస్టెంట్ మేనేజర్–9,
21. అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ గ్రేడ్ 2లో 8,
22. డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్–8,
23. డేటా ప్రొసెసింగ్ ఆఫీసర్–3.
ప్రోహిబిషన్ అండ్ ఎక్సెజ్ శాఖలో 751..
24.ప్రొహిబిషన్ ఎక్సైజ్ కానిస్టేబుల్స్– 614,
25. జూనియర్ అసిస్టెంట్స్ (లోకల్)–8,
26. జూనియర్ అసిస్టెంట్స్ (స్టేట్)–114,
27. అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్–15