వాహనదారులకు గుడ్‌న్యూస్..స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ - MicTv.in - Telugu News
mictv telugu

వాహనదారులకు గుడ్‌న్యూస్..స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్

May 4, 2022

రష్యా, ఉక్రెయిన్ దేశాల యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. పెరిగిన ధరలతో వాహనాదారులు నానా అవస్థలు పడుతున్నారు. చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో వాహనదారులపై పెనుభారం పడుతోంది. ఈ క్రమంలో పలు ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్‌ ధరలు స్వల్పంగా తగ్గాయి.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బుధవారం పెట్రోల్ లీటర్ ధర రూ.119.49 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.105.49 వద్ద స్థిరంగా ఉన్నాయి. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర 18 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.119 కాగా, 17 పైసలు తగ్గడంతో డీజిల్‌‌ లీటర్ ధర రూ.105.02 గా ఉంది. వరంగల్ రూరల్‌లో 15 పైసలు తగ్గడంతో పెట్రోల్‌ లీటర్ ధర రూ.119.22 కాగా, 13 పైసలు తగ్గడంతో డీజిల్‌‌‌ లీటర్ ధర రూ.105.23 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇక నిజామాబాద్‌లో 36 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.121.17 కాగా, డీజిల్‌‌పై 35 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.107.04లుగా ఉంది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ విషయానికొస్తే, ధరలు ఇలా ఉన్నాయి. విజయవాడలో ధరలు నిలకడగా ఉన్నాయి. పెట్రోల్‌ లీటర్ ధర రూ.121.07 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.106.69 అయింది. విశాఖపట్నంలో ఇంధన ధరలు భారీగా తగ్గాయి. 26 పైసలు తగ్గడంతో విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.120లుగా ఉంది. డీజిల్‌పై 24 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.105.65గా ఉంది. చిత్తూరులో పెట్రోల్‌పై 59 పైసలు తగ్గడంతో లీటర్ రూ.121.48 కాగా, డీజిల్‌పై 55 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.107.02లుగా ఉన్నాయి.