శుభవార్త.. ఎండలు తగ్గుతున్నాయి: వాతావరణ శాఖ - MicTv.in - Telugu News
mictv telugu

శుభవార్త.. ఎండలు తగ్గుతున్నాయి: వాతావరణ శాఖ

May 2, 2022

దేశ ప్రజలకు కేంద్ర వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఇటీవలే 122 ఏళ్ల చరిత్రలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కొట్టిన ఎండ‌లు రికార్డు సృష్టించాయని, ఒక్క ఏప్రిల్ నెలలోనే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంలో కలిపి 35.9 నుంచి 37.78 డిగ్రీల సెల్సియ‌స్‌కి ఉష్ణోగ్ర‌త‌లు చేరుకున్నాయని..వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ తెలిపిన విషయం తెలిసిందే. సోమవారం మరో కీలక విషయాన్ని అధికారులు తెలిపారు.

 

” దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వడగాలుల పరిస్థితులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈనెల 4వరకు వాయవ్య భారతంలో ఉరుములతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. తూర్పు, దక్షిణ భారత్‌లో 6వ తేదీ వరకు, ఈశాన్య ప్రాంతంలో మూడో తేదీ వరకు ఇలాంటి పరిస్థితులే ఉంటాయి.

ఢిల్లీ ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ తదితర ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడులలో వచ్చే అయిదు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది” అని అధికారులు వెల్లడించారు.