‘కెజిఎఫ్ 2’ టిక్కెట్ రేట్ల పెంపుకు అనుమతినిచ్చిన ప్రభుత్వం.. ఎంతంటే - MicTv.in - Telugu News
mictv telugu

‘కెజిఎఫ్ 2’ టిక్కెట్ రేట్ల పెంపుకు అనుమతినిచ్చిన ప్రభుత్వం.. ఎంతంటే

April 12, 2022

kgf

పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం కెజిఎఫ్ 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మొదటి భాగం సూపర్ హిట్ అవడంతో రెండో భాగంపై సినీ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఈ నెల 14న విడుదలవుతున్న ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో టిక్కెట్ల రేట్లను పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. విడుదలయిన తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ఈ పెంపు అమల్లో ఉంటుంది. అంతేకాక, రోజుకు ఐదు ఆటలు వేయడానికి కూడా అనుమతినిచ్చింది. ఇక టిక్కెట్ల రేట్ల విషయానికొస్తే.. మల్టీప్లెక్స్ స్క్రీన్లు, ఐమాక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఒక్కో టిక్కెట్ మీద రూ. 50లు, ఏసీ, ఎయిర్ కూలర్ థియేటర్లు రూ. 30 పెంచుకోవచ్చు. నాన్ ఏసీ థియేటర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాగా, థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్ ఈ రోజు సాయంత్రం 6 నుంచి చేసుకోవచ్చని చిత్ర బృందం ప్రకటించింది.

kgf