అక్రమంగా రేషన్ కార్డు కలిగున్న వారికి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి కార్డు పొందిన వారిపై చట్టపరమైన చర్యలకు దిగుతోంది. చాలా మంది అనర్హులు రేషన్ కార్డులు పొందారనే సమాచారంతో అర్హులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తాజా చర్యలు చేపడుతోందని అధికార వర్గాలు చెప్తున్నాయి. ముందుగా రేషన్ కార్డు దారులను ఇంటింటికి వెళ్లి వెరిఫికేషన్ చేస్తారు. అందులో ఒక కుటుంబానికి 100 చదరపు మీటర్ల ఫ్లాట్ లేదా ఇల్లు, ట్రాక్టర్ లేదా నాలుగు చక్రాల వాహనం, ఆయుధాల లైసెన్స్, కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో రెండు లక్షలు, పట్టణ ప్రాంతాలలో మూడు లక్షలు ఉన్నవారు రేషన్ కార్డు కలిగి ఉంటే ఆయా లబ్దిదారులు తమ కార్డును తహసీల్దార్‌కు లేదా డీఎస్వో కార్యాలయంలో సరెండర్ చేయాలి. ఒకవేళ అలా చేయకుంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అలాంటి కార్డును రద్దు చేస్తారు. ముందే సరెండర్ చేయకుండా వెరిఫికేషన్‌లో అనర్హులని తేలితే రేషన్ కార్డును రద్దు చేసి అప్పటివరకు తీసుకున్న బియ్యం తదితరాలను రికవరీ చేస్తారు. అంతేకాక, చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. సో, ఎవరికైనా పై అనర్హతలు ఉంటే ప్రభుత్వానికి అవకాశం ఇవ్వకుండా ముందే వెళ్లి రేషన్ కార్డును సరెండర్ చేయడం బెటర్.