కాసేపట్లో పెళ్లి.. డ్యాన్స్ చేస్తూ చనిపోయిన వరుడు - MicTv.in - Telugu News
mictv telugu

కాసేపట్లో పెళ్లి.. డ్యాన్స్ చేస్తూ చనిపోయిన వరుడు

May 9, 2022

కొద్ది గంటల్లో పెళ్లి చేసుకుంటున్నానన్న ఆనందంతో డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ వరుడు మృతి చెందిన ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సూరత్ జిల్లా ఆరేత్ గ్రామానికి చెందిన మితేష్ భాయ్ చౌదరి (33) వివాహం శనివారం జరగాల్సి ఉంది. అంతకు ముందు రోజు హల్దీ ఫంక్షన్ ఘనంగా జరిగింది. వివాహ ప్రక్రియ కోసం వధువు ఇంటికి వరుడు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో వధువు ఇంటికి డీజే పాటలు పెట్టి డ్యాన్స్ చేస్తూ ఊరేగింపుగా వరుడు, అతని బంధుమిత్రులు బయలుదేరారు. ఈ ఉత్సాహంలో వరుడు కూడా మిత్రులతో కలిసి డ్యాన్స్ చేస్తుండగా, ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఆందోళనకు గురైన బంధుమిత్రులు వరుడిని తీసుకొని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా, వారు వైద్యం చేయడానికి నిరాకరించారు. దాంతో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు వరుడు అప్పటికే మరణించాడని చెప్పడంతో వరుడి కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.