వీడియో : తాళి కడుతుండగా షాకిచ్చిన వధువు.. మూర్ఛపోయిన వరుడు - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : తాళి కడుతుండగా షాకిచ్చిన వధువు.. మూర్ఛపోయిన వరుడు

May 19, 2022

కొద్దిసేపట్లో వరుడు వధువు మెడలో తాళి కడతాడు అనగా వధువు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. వధువు చెప్పిన మాటతో వరుడు మూర్ఛపోయాడు. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రేమ్ గ్రామానికి చెందని యువకుడికి పెళ్లి నిశ్చయమైంది. పెళ్లిరోజు రాగా, పెళ్లి పీటలపై వధూవరులు కూర్చున్నారు. ఆచారం ప్రకారం పెళ్లి తంతు మొదలవగా, కీలకమైన తాళి కట్టే సమయం రానే వచ్చింది. ఇంతలో అంతవరకు బాగానే ఉన్న వధువు ఇది తనకు మొదటి పెళ్లి కాదని, తనకు ఇంతకు ముందే వేరే వ్యక్తితో పెళ్లయిపోయిందనే షాకింగ్ న్యూస్ చెప్పింది. వధువు మాటలు విన్న వరుడు అనూహ్య పరిణామానికి పీటల మీదే షాకయి మూర్ఛపోయాడు. దీంతో వధువు తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు వధువుని చితకబాదారు. ఇంతకు ముందే ఎందుకు చెప్పలేదని మండపంలోనే నిలదీస్తూ చెంపలు వాయించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.