ముహుర్తాలు కుదరడంతో ఈ సీజన్లో దేశ వ్యాప్తంగా చాలా పెళ్లిళ్లు అవుతున్నాయి. దాంతో పాటు అంతే స్థాయిలో ఫన్నీ సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా వీడియోలు మనం చూసి ఉంటాం. కానీ, ఈ తరహా సంఘటన మాత్రం ఇప్పటి వరకు జరగలేదని చెప్పాలి. వివరాలు.. పెళ్లి అయిన తర్వాత నూతన భార్యభర్తలు వేదిక మీద ఉన్నారు. ఎదురుగా బంధుమిత్రులు, అతిథులు అందరూ చూస్తున్నారు. వేదిక మీద పూలమాల వేసుకునే కార్యకరమం జరుగుతోంది.
View this post on Instagram
అప్పటికే తాళి కట్టడం లాంటి కార్యక్రమాలు పూర్తవడంతో తర్వాత పూలమాలలు వేసే కార్యక్రమం జరుగుతోంది. మొదటగా నూతన వధువు భర్త మెడలో పూలమాల వేసింది. వెంటనే భర్త కూడా పూల మాల తీసి భార్య మెడలో వేశాడు. ఇంతలో వరుడు వేసుకున్న ప్యాంటు కిందకు జారిపోయింది. వరుడు గమనించకుండా పూలమాల వేసే పనిలో ఉన్నాడు. ఇది చూసిన వధువు సిగ్గుతో కిసుక్కున నవ్వగా అప్పుడు గ్రహించిన వరుడు నవ్వుతూ జారిన ప్యాంటును వేసుకున్నాడు. ఈ తతంగాన్నంతా వీడియోగ్రాఫర్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్గా మారింది. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందన్నది తెలియరాలేదు.